నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
...........................................
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.బుధవారం జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డును సందర్శించిన జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య నిర్వహణ, డ్రై డే కార్యక్రమాలు, యాంటీ లార్వా చర్యలు, ఫీవర్ సర్వేలు, దోమల నివారణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పలు వార్డుల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ*
జిల్లాలో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలంటే ప్రతి ఇంటిని పరిశీలించడం అత్యంత అవసరమన్నారు.
ఇళ్లలో పాత టైర్లు, కూలర్లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, ఖాళీ సీసాలు, నీరు నిల్వ ఉండే పాత్రలు వంటి వాటిని గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. దోమల లార్వా పెరిగే ప్రాంతాల్లో యాంటీ లార్వా స్ప్రేలు, ఆయిల్ బాల్స్ వినియోగించాలని సూచించారు.
ప్రతి రోజు డ్రై డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఫీవర్ సర్వేలను నిరంతరం కొనసాగిస్తూ జ్వర లక్షణాలు ఉన్న వారిని వెంటనే పరీక్షలకు పంపించాలని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులనే నివేదికలుగా సమర్పించాలని, తప్పుడు సమాచారం ఇవ్వకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
*ప్రజల్లో పరిశుభ్రతపై మరింత అవగాహన కల్పించాలి*
"మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం – సీజనల్ వ్యాధులను దూరం చేద్దాం" అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చెత్త సేకరణ వాహనాలు, మైకింగ్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.
అలాగే వీధి ఆహార విక్రేతల వద్ద పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, వైద్య సామగ్రి తగినంత అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, డిప్యూటీ DM &HO శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*జగిత్యాల మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య చర్యలు, డ్రై డే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్* ------------------------------------------
Quick Summary:
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా