Telangana
*ఆపదలో అండగా సీఎం సహాయ నిధి* * లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్
Quick Summary:
*ఆపదలో అండగా సీఎం సహాయ నిధి*
*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలం లోని గుల్లకోట గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.1,78,000 విలువైన చెక్కులను గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రజాప్రతినిధిగా ముందుండి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోడేటి శ్రీకాంత్‌కు రూ.60,000, పులి లక్ష్మణ్‌కు రూ.57,500, భిసగొని అభిషేక్‌కు రూ.22,500, గొల్లపెల్లి మల్లవ్వకు రూ.22,500, పెంజర్ల కొమురమ్మకు రూ.13,500, లింగంపెల్లి మమతకు రూ.12,000 చొప్పున మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరిగెల జయవ్వ-రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బిసగోని సత్యం, ఏఎంసీ డైరెక్టర్ ద్యావా మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు భూసారపు భూమయ్య, గోనె సురేష్, పొన్నం లక్ష్మణ్, గోనె పరమేష్, గుండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.