*
*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్
290 డివిజన్ అధ్యక్షునిగా నియామక పత్రాన్ని అందుకున్న ద్వారంపూడి నాగిరెడ్డి,
డివిజన్ అధ్యక్షునిగా నియమించబడిన ద్వారంపూడి నాగిరెడ్డి కి నియామక పత్రాన్ని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డి కి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి, మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీ సంస్థాగత బలోపేతానికి అందరిని కలుపుకు పోతూ సమన్వయం తో పార్టీ బలోపేతానికీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ మహిళ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, పార్టీ నాయకులు, డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, 290 డివిజన్ మహిళా అధ్యక్షురాలు తులసి, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ , సాయి వర్మ ,కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*290 డివిజన్ అధ్యక్షునిగా నియమక పత్రాన్ని అందుకున్న ద్వారంపూడి నాగిరెడ్డి
Quick Summary:
290 డివిజన్ అధ్యక్షునిగా నియమక పత్రాన్ని