నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. రామచంద్రానగర్ గ్రామంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వసుకుల రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలి తెలంగాణ రాష్ట్ర పెరిక కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన దొంగరి వెంకటేశ్వర్లు(DV) ల ను ఉద్యోగ ఉపాధ్యాయ మిత్ర మండలి రామచంద్రానగర్ తరపున ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిక కుల అభ్యున్నతికి పాటుపడతానని మరియు తరతమ బేధం లేకుండా అర్హులైన అందరికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. సభాధ్యక్షులు రామారావు మాట్లాడుతూ DV మరిన్ని ఉన్నత పదవులు అలంరించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచి దొంగరి కృష్ణకుమారి, ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారి రామినేని శ్రీవర్తిక చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
Telangana
**తెలంగాణ రాష్ట్ర పరిక సంఘం చైర్మన్ కు ఘన సన్మానం**
Quick Summary:
తెలంగాణ రాష్ట్ర పరిక సంఘం చైర్మన్ కు ఘన సన్మానం..