Telangana
కళాశాలల "బీసీ బంద్" విజయవంతం.... -బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
Quick Summary:
కళాశాలల "బీసీ బంద్"
నేటిసాక్షి, మిర్యాలగూడ :తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో స్కాలర్షిప్ లు విడుదల చేయకపోవడంతో, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు వ్యాప్తంగా కళాశాల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో, మిర్యాలగూడలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు చదువుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందని, విద్యార్థులకు అందవలసినటువంటి పెండింగ్ ఫీజు బకాయిలు నేటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు నోచుకోలేని పరిస్థితి ఉన్నదని ఆరోపించారు. ఈ తెలంగాణలో ఏర్పడ్డది విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే స్కాలర్ షిప్స్ లు గత మూడు సంవత్సరాలుగా ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధిస్తుండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. అలాగే ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ తదితర వృత్తి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్ అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వమని విద్యార్థులు వేడుకుంటే డబ్బులు చెల్లిస్తేనే ఇస్తామంటూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తా ఉన్నాయని, ప్రభుత్వం బీసీ విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి పెండింగ్ ఫీజు బకాయిలు పూర్తిస్థాయిలో విడుదల చేసి, బీసీ విద్యార్థులకు తోడుగా ప్రభుత్వం ఉండాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు పట్టేటి రమేష్, బీసీ యువజన సంఘం నియోజకవర్గ నాయకులు మునగాల శైలేందర్, బీసీ యువజన సంఘం పట్టణ కన్వీనర్ ఉపేందర్, రాజు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.