నేటి సాక్షి న్యూస్ జూలై 11
మంత్రాలయం నియోజకవర్గంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పెద్దకడబూరు మండలంలోని కంబలదిన్నె, జాలవాడి, మురవణి, దొడ్డిమేకల, పెద్దకడబూరు, చిన్నతుంబలం గ్రామాల్లో శనివారం ఓటరు వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ చైర్మన్ కందనాతి నరసప్ప పాల్గొని బూత్‌ల వద్ద జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటి సర్వే ద్వారా సేకరిస్తున్న వివరాలను పరిశీలిస్తూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు.
ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లో ఉన్న లోపాలను గుర్తించి సకాలంలో సరిదిద్దాలని, కొత్తగా అర్హత పొందిన ఓటర్ల వివరాలను నమోదు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని నాయకులు తెలిపారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్వోలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బీఎల్వోలు పాల్గొన్నారు.
Andhra
హెడ్లైన్ : పెద్దకడబూరు మండలంలో ఎస్‌ఐఆర్ ఓటరు వెరిఫికేషన్ కార్యక్రమం
Quick Summary:
మంత్రాలయం నియోజకవర్గంలో ఓటరు జాబితాల