*నేటిసాక్షి* జూలై 2 తిరుమలాయపాలెం (రుద్రరాజు )
తిరుమలాయపాలెం మండలంలో జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమం శుక్రవారం (జూలై 3) ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభం కానుందని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తోందన్నారు. గ్రామాల వారీగా ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు చెప్పారు.
తిరుమలాయపాలెం మండలం లోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే లబ్ధిదారులు తమ గ్రామానికి కేటాయించిన సమయానికి అవసరమైన వివరాలతో హాజరై ఆర్థిక సహాయాన్ని పొందాలని సూచించారు. మానవత్వం, సేవాభావంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని చావా శివరామకృష్ణ పేర్కొన్నారు.
Telangana
*నేడే తిరుమలాయపాలెం మండలం లో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం* పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ
Quick Summary:
పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్