నేటిసాక్షి, మిర్యాలగూడ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు సహా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి, సంక్షేమ పాలనకు కొత్త దిశానిర్దేశం చేసిన నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘన
నివాళులర్పించారు.
Telangana
ప్రజా సంక్షేమానికి చిరస్మరణీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Quick Summary:
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
