నేటిసాక్షి మంచిర్యాల (శ్రీధర్ దమ్మ)
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ పట్టణంలో బుధవారం రోజున తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో
స్రి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి సీడీపీఓ కార్యాలయ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి*
మాట్లాడుతూ...ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ఫ్రీ ప్రైమరి, పిఎంశ్రీ మొత్తం 4,131 కేంద్రాలను తక్షణమే రద్దు చేసి, ఈ కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలన్నారు.ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలి. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.ప్రతి నెల ఒకటవ తేదీన అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలి.
3,15వేల కాళీ పోస్టులు భర్తీ చేయాలి.పీఫ్, ఈపిఎస్ సౌకర్యం కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యోగులకు గ్రాటివీటి మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలి.అంగన్వాడి కేంద్రాలకు పక్క భవనాలు నిర్మించాలి మౌలిక వసతులు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో కనికరపు అశోక్ వ్యకస సంఘం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ ఉద్యోగులు పద్మ, అనసూయ,విజయశ్రీ, సరిత, శైలజ, లక్ష్మి సునీత కమల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Telangana
* ఫ్రీ ప్రైమరి, పిఎంశ్రీని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి * అంగన్వాడీ ఉద్యోగులకు 18,000/- వేతనం చెల్లించాలి * సీఐటీయు ఆధ్వర్యంలో మహిళ స్రి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి సీడీపీఓ కార్యాలయంలో వినతి * రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి * దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి
Quick Summary:
ఫ్రీ ప్రైమరి, పి ఏం శ్రీ ని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలి..