నేటిసాక్షి,
మిర్యాలగూడ, జూలై 21 : మిర్యాలగూడ పట్టణంలోని 36వ వార్డు సుందర్‌నగర్‌లో మూతలు లేకుండా ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ స్థానిక ప్రజలకు ప్రాణాంతకంగా మారాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షపు నీటిలో మ్యాన్‌హోల్స్ కనిపించకుండా పోతుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు, పాదచారులు, వాహనదారులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ నుంచి దుర్వాసనలు వెదజల్లడంతో పాటు దోమలు విపరీతంగా పెరిగి, పరిసర ప్రాంత ప్రజలు అంటువ్యాధుల బారిన పడే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.
ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించి, మూతలు లేని మ్యాన్‌హోల్స్‌కు వెంటనే మూతలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని 36వ వార్డు సుందర్‌నగర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Telangana
"మూతలు లేని మ్యాన్‌హోల్స్‌తో ప్రాణాపాయం"..! -పట్టించుకోని మున్సిపల్ అధికారులు
Quick Summary:
మిర్యాలగూడ, జూలై 21 : మిర్యాలగూడ పట్టణంలోని
