నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా క్రైమ్ స్టాఫ్, సైబర్ వారియర్స్‌కు సీడీర్ , ఐపీడీర్ , టవర్ డంప్ అనాలిసిస్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ (X) ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా నేరాల దర్యాప్తు, పెండింగ్ కేసుల ఛేదన అంశాలపై నిర్వహించిన ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం నేరాల స్వరూపం వేగంగా మారుతున్నందున సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన ప్రతి దర్యాప్తు అధికారికి అత్యంత అవసరమని తెలిపారు. నేరస్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో, సీడీర్ , ఐపీడీర్ , టవర్ డంప్ డేటా విశ్లేషణతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సమర్థవంతమైన శోధన ద్వారా కీలక ఆధారాలను సేకరించి కేసులను త్వరితగతిన ఛేదించవచ్చని సూచించారు.
పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సాంకేతిక ఆధారాలను వినియోగించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, ప్రతి కేసులో డిజిటల్ సాక్ష్యాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి కోర్టులో బలమైన అభియోగపత్రాలు దాఖలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా, సోషల్ మీడియా వేదికల ద్వారా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించడం, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కనుగొనడం, మోసాలు, సైబర్ నేరాలు, మహిళలు చిన్నారులకు సంబంధించిన కేసుల్లో డిజిటల్ ఇంటెలిజెన్స్‌ను సమర్థంగా వినియోగించాలని సూచించారు.
ప్రతి దర్యాప్తు అధికారికి సహాయకంగా ప్రతి క్రైమ్ స్టాఫ్ సిబ్బంది ఆధునిక దర్యాప్తు పద్ధతులపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించేలా కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో డిటిసి డిఎస్‌పి శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, ఐటి సెల్ ఎస్‌ఐ శంకర్,ఐటి సెల్ సిబ్బంది, జిల్లా క్రైమ్ స్టాఫ్, సైబర్ వారియర్స్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
కేసుల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి. జిల్లా క్రైమ్ స్టాఫ్, సైబర్ వారియర్స్‌కు దిశానిర్దేశం. వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,
Quick Summary:
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,
