*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్ లో బుధవారం ( రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.
జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్‌లోని బాలకృష్ణ హైస్కూల్ ఎదురుగా ఉన్న ప్లాట్ నెం.90లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాందాస్ బండు అథవాలే ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి భీమ్ రాజ్ సేన వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు కాంబ్లే రాజేష్ ఆహ్వానం పలికారు. సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పార్టీ మరింత బలోపేతంగా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదములు తెలియజేసారు.
Telangana
*హైదరాబాద్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం*
Quick Summary:
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
