Telangana
*సర్ ప్రక్రియలో అధికారులతో సమన్వయం చేసుకోండి* ముసుగు శ్రీనివాస్ రెడ్డి అనంతగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పిలుపు
Quick Summary:
ముసుగు శ్రీనివాస్ రెడ్డి
నేటి సాక్షి అనంతగిరి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు చురుగ్గా పాల్గొనాలని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముసుగు శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రభుత్వం నియమించిన అధికారులతో పార్టీ ఏజెంట్లు నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించడంలో అధికారులు తో కలిసి, ఏజెంట్లు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ ఈ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.