నేటి సాక్షి ఆగస్టు 15 నంద్యాల జిల్లా :-
నంద్యాల జిల్లా నందికొట్కూరుమండల కేంద్రలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపాలిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
దేశభక్తి, పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి పథంలో నందికొట్కూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. దేశ సమైక్యతను దెబ్బతీసే శక్తులను ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. అంతేకాకుండా జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి మన నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ స్వాతంత్య్రం దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.80వ స్వాతంత్య్రం దినోత్సవం వేడుకల్లో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు మరియు అందరూ పాల్గొన్నారు కార్యకర్తలు, మున్సిపాలిటీ అధికారులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది
Andhra
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య
Quick Summary:
నంద్యాల జిల్లా నందికొట్కూరుమండల
