*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్‌గా రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రంగా శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఓబీసీ మోర్చా మేడ్చల్ జిల్లా (అర్బన్) అధ్యక్షులు జెకె. శేఖర్ యాదవ్ నియామకాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలకంగా, నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, బాధ్యతలు లభిస్తాయని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మూడు దశాబ్దాలకుపైగా బీజేపీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభించి అంకితభావంతో పనిచేసిన తన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందని పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకత్వానికి, సికింద్రాబాద్ మహంకాళి ఇన్‌చార్జి నందనం దివాకర్, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Telangana
*ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్‌గా రంగా శ్రీనివాస్ గౌడ్*
Quick Summary:
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా