నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
జగిత్యాల పట్టణ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అత్యవసరమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
గత 4 దశాబ్దాలుగా జిల్లా ప్రజలకు రోటరీ క్లబ్ జగిత్యాల నిరంతరం సేవలు అందిస్తోందని కొనియాడారు.
జగిత్యాల రోటరీ క్లబ్, ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్డులో ఉన్న సత్య హరిశ్చంద్ర శ్మశాన వాటికలో 3 డెడ్ బాడీ ఫ్రీజర్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ*
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ అరవలక్ష్మీ రాజు, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, ఏ.వి.ఎల్.ఎన్. చారి, టి.వి. సూర్యం, కొత్త ప్రతాప్, త్రివేణి సాగర్, ఎన్నాకుల అశోక్, ఆంటోనీ ముత్తు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు రాజ్ కుమార్, బోడ్ల జగదీష్, నాయకులు రామకృష్ణ రెడ్డి, ఆపి కార్యనిర్వాహక సభ్యురాలు రాధికా సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*పట్టణ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరం* *జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్* *రోటరీ, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 3 డెడ్ బాడీ ఫ్రీజర్ల అందజేత* ----------------------------------------
Quick Summary:
*జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్*