నేటి సాక్షి 08 జూలై నంద్యాల :-
నంద్యాల జిల్లా కేంద్రం శ్రీనివాస సెంటర్ నందు నేడు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్యవిగ్రహాన్ని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆద్వర్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఎర్రబోతుల... మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, నందికోట్కూర్ ఇంచార్జీ డా. ధారా సుధీర్, ఎమ్మెల్సీలు ఇసాక్ బాష, కల్పలతారెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్సీ చైర్మన్ డాక్టర్ నౌమన్, శిల్ప భువనేశ్వర్ రెడ్డి ,వైసీపీ ముఖ్యనేతలు కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ముందుగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గృహం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల భారీ ర్యాలీగా బయలుదేరి శ్రీనివాస సెంటర్ కు చేరుకోవడం జరిగింది. వైసీపీ నేతలు డా. వైఎస్సార్ కాంస్యవిగ్రహానికి గజమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నివాసం నుండి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ర్యాలీగా శ్రీనివాస సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం నేతలంతా కలిసి వైఎస్సార్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మహానేత విగ్రహ ఆవిష్కరణకు అశేష జనవాహిని తరలిరావడమే వైఎస్సార్‌పై ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. డాక్టర్ వైఎస్సార్ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మరువలేదని.. ఆయన బాటలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, సంక్షేమం అభివృద్ది చేశారని గుర్తుచేశారు. నంద్యాలలో ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఇక్కడున్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఇక ఇక్కడ విగ్రహం ఏర్పాటు కాదేమో అని కొందరు భావించారని.. కానీ ఫైబర్ విగ్రహం స్థానంలో మరింత పటిష్టమైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి చూపించామన్నారు.
"కుట్రలు పన్ని మహానేత విగ్రహాన్ని తీసేయగలిగారేమో కానీ.. ప్రజల గుండెల్లో ఉన్న రాజన్నను ఎవ్వరూ చెరపలేరన్నారు. 2009లో మరణించిన నేతకు 2026లో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో అర్థం చేసుకోవచ్చని." అని శిల్పా రవి రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేవలం మూడు సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉందని.. ఇప్పటికే మొదటి హాఫ్ (సగం కాలం) పూర్తయిందని, రెండో హాఫ్ మొదలైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రతో పార్టీ 'బ్లాక్ బస్టర్ హిట్' కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో నంద్యాల నుంచే విజయప్రస్థానం మొదలుపెట్టి.. జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుని తీరుతామని సవాల్ విసిరారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు నంద్యాల పట్టణ ప్రజలకు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం పరిశీలకుడు పి పి మధుసూదన్ రెడ్డి, డోన్ పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి, నంద్యాల పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ నెంబర్లు సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, స్టేట్ మహిళ జనరల్ సెక్రటరీ శశికళ రెడ్డి, స్టేట్ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, స్టేట్ ఎస్టీ సెల్ జనరల్ సెక్రెటరీ శంకర్ నాయక్, స్టేట్ లీగల్ సెల్ సభ్యులు,మాజీ మున్సిపల్ చైర్మన్ మభూన్నిసా, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసిపి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విజయ శేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మహేశ్వర రెడ్డి, ఎంపీపీలు ఆర్థర్ సైమన్, శెట్టి ప్రభాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసిపి జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్ అమృతరాజు, రసూల్ ఆజాద్, టైలర్ శివ,టి వి రమణ, కారు రవికుమార్, దేవ నగర్ భాష, శివనాగిరెడ్డి, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ లీగల్ సెల్ సభ్యులు మాజీ కౌన్సిలర్స్, వైసీపీ ఇన్చార్జిలు, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
Andhra
నంద్యాలలో ఘనంగా వైఎస్సార్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. తరలివచ్చిన జనసంద్రం! • నంద్యాలలో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం రానున్నది జగనన్న పాలన, రాజన్న రాజ్యం : మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ధీమా! • కుట్రలతో విగ్రహాలు తొలగించగలరు.. ప్రజల గుండెల్లోని రాజన్నను చెరపలేరు: శిల్పా రవి రెడ్డి ! • 2.O మొదలైంది.. జగనన్న పాదయాత్రతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం: శిల్పా రవి రెడ్డి...
Quick Summary:
నంద్యాలలో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా
