నేటి సాక్షి, నారాయణపేట జులై 2 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని చర్లపల్లి గ్రామంలో పాత డ్రైనేజీ గ్రామానికి చెందిన కొందరు మట్టి వేసి పూర్చి వేయడం జరిగింది. డ్రైనేజీ పై నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందని గ్రామస్తులు వివరించారు. ఇట్టి విషయంపై గత మూడు నెలలుగా నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చర్లపల్లి గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేసిన కూడా మండల అధికారులు,గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని చర్లపల్లి గ్రామ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిసారి ప్రతి సోమవారం రోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలు అందజేస్తున్న కేవలం సంతకాలు చేసి పంపిస్తున్నారు తప్ప చిన్న పని చేయలేకపోతున్నారని గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు. చర్లపల్లి గ్రామంలో డ్రైనేజీ వేసిన మట్టి తీయలేకపోతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. చివరకు ధన్వాడ మండల పోలీసులు వచ్చినా కూడా ఇలా చూసి అలా వెళుతున్నారే తప్ప పని చేయలేకపోతున్నారని ఆరోపించారు.
Telangana
పేట జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేకాతర్...... పాత డ్రైనేజీలో మట్టి తీయని గ్రామపంచాయతీ అధికారులు....... పట్టించుకోని మండల. గ్రామ పంచాయతీ అధికారులు.......
Quick Summary:
పట్టించుకోని మండల. గ్రామ పంచాయతీ అధికారులు.......
