నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఆగస్టు 11
వారికి ఎవరూ లేకపోయినా, మరణం తరువాత మానవత్వాన్ని చాటుతూ ఎంతోమంది పోలీసులు మరియు స్వచ్ఛంద సంస్థలు అనాథ శవాలకు తమ సొంత ఖర్చులతో లేదా దాతల సహాయంతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో పోలీసులు చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి, స్థానిక పంచాయతీ లేదా సేవా ట్రస్టుల సహాయంతో దహన సంస్కారాలు జరిపిస్తారు.ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ 9 సంవత్సరాల క్రితం ఒక మూగ చెవుడు యువకుడు ( పేరు తెలియదు 28 సంవత్సరాలు)చౌడేపల్లికి చేరుకున్నాడు బస్టాండులో అందరితో మంచితనంతో ఉంటూ పనులు చేసుకుని సంపాదించి జీవించేవాడు ఈ క్రమంలో మంగళవారం చౌడేపల్లికి సమీపంలోని చిట్రెడ్డి చెరువులో శవమై తేలాడు ప్రతిరోజు స్నానానికి చెరువుకు వెళ్లేవాడు ఇదే క్రమంలో ఈనెల 10న స్నానానికి వెళ్లిన అతను తిరిగి రాలేదు. సందేహం వచ్చిన స్థానిక బస్టాండ్లో ఉండేవారు. చుట్టుపక్కల వెతికి వెతకగా చెరువులో శివమై కనిపించాడు మూగ అతనిగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు అయితే పారిశుద్ధ కార్మికులు మృతదేహాన్ని చెరువులో నుంచి తీసేందుకు రాకుండా పోవడంతో స్వయంగా పోలీసులే గట్టుపైకి తెచ్చి అనాధ సవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Andhra
అనాధ శవానికి అంత్యక్రియలు... మానవత్వాన్ని చాటుకున్న పోలీస్ అనాథ మృత దేహం కి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది .. చిట్రెడ్డి చెరువులో పడి యువకుడు మృతి
Quick Summary:
చిట్రెడ్డి చెరువులో పడి యువకుడు మృతి
