నేటి సాక్షి ధర్మపురి *విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కొప్పుల దంపతులు*
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తమ సతీమణితో కలిసి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయానికి చేరుకున్న మాజీ మంత్రి దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాల అనంతరం పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం అందించారు.
అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆ కనకదుర్గమ్మ దివ్య దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
Telangana
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కొప్పుల దంపతులు*
Quick Summary:
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కొప్పుల దంపతులు
