నేటి సాక్షి.శంకర్‌పల్లి: జూలై 02: ( సుధాకర్ గౌడ్):
సాన్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ ప్లేటేషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి జడ్ పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో గురువారం నాల్గవ ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని డాక్టర్ సాయి సింధు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు డాక్టర్ ఉచిత ఓపి సేవలు ఉచిత మందులను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య సూచనలు అవసరమైన వారికి వైద్య సలహాలు అందించనున్నట్లు వివరించారు. విద్యార్థులకు ప్రొజెక్టర్ పై చర్మ ఎలర్జీ, వెంట్రుకలు రాలుట, గజ్జి, తామర, దురద, దద్దుర్లు, పులిపిరులు, కురుపులు, పుండ్లు, మొటిమలు, నల్లని, తెల్లని, బొల్లి మచ్చలు, తెల్లని పూత, వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన చర్మ వైద్య సేవలు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
సామాజిక సేవలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు డాక్టర్ వెల్లడించింది. పాఠశాల విద్యార్థులు ఈ ఉచిత చర్మ సంబంధమైన ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ అపాయింట్మెంట్ కొరకు మున్సిపల్ పరిధిలోని రామంతాపురం గేటు వద్ద గల సాన్స్ హాస్పిటల్ నెంబర్ (8337000777) ను సంప్రదించాలని పేర్కొన్నారు. డాక్టర్ సాయి సింధు సాన్స్ హాస్పిటల్ తరఫున పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Telangana
సాన్స్ స్కిన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి జడ్ పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
Quick Summary:
పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
