*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాలుగు నెలలు పైబడిన దూడలు లాగేలు ఎద్దులు మరియు ఆవులకు లంపి స్కిన్ ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం శనివారం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది వర్షాకాలం మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పశువులకు ఈ అంటువ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి కాసారపు భవాని అరవింద్ గౌడ్ మరియు ఉపసర్పంచ్ శ్రీ సిరవేణి రవి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలను ప్రతి ఒక్క రైతుసద్వినియోగం చేసుకోవాలని కోరారు పశువులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ టీకాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు పాల్గొన్న అధికారులు మరియు ప్రముఖులు ఈ లంపి స్కిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది మరియు స్థానిక నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో సిరవేణి రవి ఉప సర్పంచ్ డాక్టర్ రవీందర్ మండల పశువైద్యాధికారి రాజశ్రీ నర్సయ్య, రమేష్ శ్రీకాంత్ గోపాలమిత్ర గ్రామ రైతులు ప్రవీణ్ గౌడ్ సత్తయ్య మరియు తదితరులు పాల్గొన్నారు పశువైద్యాధికారి డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ లంపి స్కిన్ వ్యాధి పట్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందస్తు టీకాల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చని వివరించారు. గ్రామంలోని పశువులన్నింటికీ విజయవంతంగా టీకాలు వేసిన పశువైద్య సిబ్బందిని మరియు సహకరించిన రైతులకు సర్పంచ్ ఉపసర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు
Telangana
పశువులకు విజయవంతంగా లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు
Quick Summary:
పశువులకు విజయవంతంగా లంపి స్కిన్ వ్యాధి