నేటి సాక్షి గజ్వేల్ :=--
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సిద్దిపేట జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని నూతనంగా నియమితులైన బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఎలకంటి సురేష్ అన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం. రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్, రాష్ట్ర నాయకుడు పూదరి నందన్ గౌడ్ తనకు జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. యువత, మహిళలు, రైతులు, మేధావులను పార్టీతో అనుసంధానం చేసి బీజేపీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక అని, వారి కష్టానికి తగిన గుర్తింపు లభించేలా నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాలను వివరించే కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తూ జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తానని స్పష్టం చేశారు.
Telangana
బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా ఎలకంటి సురేష్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు.. కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని వెల్లడి
Quick Summary:
పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు..
