నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ
పోరాట యోధుడు కామ్రేడ్ దొడ్డ నారాయణరావు ప్రధమ వర్ధంతిని చిలుకూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డ నారాయణరావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం
.. జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డ నారాయణరావు పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారని మహాసభ కార్యక్రముములో వాలంటీర్ గ పనిచేసిన దొడ్డ నారాయణరావు సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితుడై నిజాం వ్యతిరేక ఉద్యమం, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని భూస్వాముల గుండాలు కౌలు పేరుతో చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహా ఉద్యమకారుడు. అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి. రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే
కోనంనేని సాంబశివరావు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బొమ్మగాని ప్రభాకర్ జాస్తి సుబ్బారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ బెజవాడ వెంకటేశ్వర్లు సిపిఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి షేక్ సాహెబ్ అలీ, దొడ్డ రమేష్, దొడ్డ శ్రీధర్ బాబు నంద్యాల రామిరెడ్డి పిల్లుట్ల కనకయ్య, కొండ కోటయ్య , కొడారు శ్రీను, , కట్ట కోల నాగేశ్వరరావు సిరాపురపు శీను దొడ్డ నారాయణ కుటుంబ సభ్యులు సిపిఐ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఘనంగా కామ్రేడ్ దొడ్డ నారాయణరావు ప్రథమ వర్ధంతి...*
Quick Summary:
కామ్రేడ్ దొడ్డ నారాయణరావు ప్రథమ వర్ధంతి...*
