నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
........................................
ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్య అధ్యాపక పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన *G.O.Rt.No.1276, Finance (HRM.VII) Department, తేదీ: 16.07.2026* ప్రకారం, *31.03.2027 వరకు* కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
*ఖాళీల వివరాలు:*
*ప్రొఫెసర్లు – 11 పోస్టులు*
*అసోసియేట్ ప్రొఫెసర్లు – 29 పోస్టులు*
*అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 29 పోస్టులు*
మొత్తం *69 పోస్టులను* భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు *24.08.2026 ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు* జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని తెలిపారు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు, అనుభవం, రిజిస్ట్రేషన్ తదితర ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.
పోస్టుల వారీగా అర్హతలు, ఎంపిక విధానం, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర పూర్తి వివరాలను *[www.gmcjagtial.com](http://www.gmcjagtial.com)* మరియు *https://jagtial.telangana.gov.in/* వెబ్‌సైట్ల లో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు చేపడుతున్న ఈ నియామకాల తో జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది అందుబాటు పెరిగి, వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన, శిక్షణ అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Telangana
*జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో 69 వైద్య అధ్యాపక పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్* ----------------------------------------
Quick Summary:
ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు