నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
......................................
జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు హెల్త్ కార్డులు, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టి డబ్ల్యూ జే ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య నాయకత్వంలోని జగిత్యాల జిల్లా ఫెడరేషన్ నాయకులు కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. జగిత్యాల పట్టణంలోని జర్నలిస్టులకు దాదాపు 3 దశబ్దాలుగా ప్రభుత్వం ఎలాంటి స్థలాలు కేటాయించలేదని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పాత్రికేయులకు మొండిచేయ్యేచూపిస్తున్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు మోక్షం మీ ఆయమంలోనైనా కల్పించండి.గతంలో ధరూర్ క్యాంపు, నరసింగాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేసి స్థలాలను సిద్ధం చేసి పట్టాలు ఇస్తాం అని ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని మంత్రితో చర్చించారు.. జిల్లా కేంద్రం జగిత్యాలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ తదితర మీడియా సంస్థల్లో సుమారు 200 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే నివేశన స్థలాలు కేటాయించాలని, హెల్త్ కార్డులు అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు.
*సానుకూలంగా స్పందించిన పౌర సంబంధాల శాఖ మంత్రి*
ఈ సందర్బంగా మంత్రి
మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే జర్నలిస్టుల సమస్యను పరిష్కరించి జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జగిత్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేన్నేని రవీందర్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు,ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్. జయపాల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముద లింగారెడ్డి, సీనియర్ పాత్రికేయులు టీ జే ఏ జిల్లా అధ్యక్షులు, జిల్లా అక్రిడీటేషన్ కమిటీ సభ్యులు ద్యావర సంజీవ రాజు, ప్రిలాన్స్ జర్నలిస్ట్ శ్రీశైలం,టి డబ్ల్యూ జే ఎఫ్ సహాయ కార్యదర్శి అనంతుల కాంతారావు, వైస్ రాగం రమేశ్, గంగాధర్, కృష్ణకుమార్, రమేష్, నరేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పాత్రికేయులకు మొండిచేయ్యేనా....* *జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు మోక్షం ఎప్పుడు....* *మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాన్ని అందించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు* ---------------------------------------
Quick Summary:
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు మోక్షం ఎప్పుడు....*