నేటి సాక్షి,మునగాల
మండల కేంద్రంలోని 11వ వార్డులో సీపీఎస్ పాఠశాల ఆవరణలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడీ కేంద్రానికి బుధవారం శంకుస్థాపన చేశారు. చిన్నారులకు మెరుగైన వసతులు, సురక్షితమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రం నిర్మాణం పూర్తయితే చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సేవలు మరింత సౌకర్యవంతంగా అందనున్నాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, వైస్ సర్పంచ్ కాసర్ల వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము వీధరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల జానకిరెడ్డి, కాసర్ల సీతయ్య, అక్కినపల్లి రవి, నాగరాజు, 11, 12వ వార్డుల సభ్యులు, ఏఈ వసంత, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Telangana
చిన్నారుల భవిష్యత్తుకు బాటలు..
Quick Summary:
ఆవరణలో రూ.12 లక్షల వ్యయంతో