*నేటిసాక్షి*
ఆగస్టు19 (రుద్రరాజు)
గత రెండు రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తిరుమలాయపాలెం ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసన దీక్షలు గ్రామపంచాయతీ వర్కర్స్ భారీగా పాల్గొని విజయవంతం చేశారు అనంతరం తిరుమలాయపాలెం ప్రధాన కూడలిలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శీనుసిఐటియు జిల్లా నాయకులు వసపంగువీరన్న మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తున్న గ్రామపంచాయతీ వర్కర్స్ ని ప్రభుత్వము ఉద్యోగులుగా గుర్తించకపోవడం అన్యాయమని గ్రామపంచాయతీ వర్కర్స్ కి ప్రమాదంగా ఉన్న మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని జీవో నెంబర్ 51 ని సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రమాదంలో మరణించిన కార్మికుడికి 30 వేల రూపాయలు దాన సంస్కారాలకు ఇవ్వాలని గ్రామపంచాయతీలో పనిచేస్తున్నది అందరూ బడుగు బలహీన వర్గాలే కాబట్టి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని అభివృద్ధి పేరుతోసర్పంచులు ఉప సర్పంచ్ పంచాయతీ కార్మికులనువేధింపులను ఆపాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఏకరూప దుస్తులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తదనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో సిలార్ గారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో గారు మాట్లాడుతూ పల్లెలకు అభివృద్ధి ప్రదాతలైన మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిన నాతో నేరుగా మాట్లాడాలని కార్మికులకు భరోసనిచ్చారు మీ సమస్యల పట్ల నేను ఎప్పటికప్పుడు రిపోర్టు తెప్పించుకొని మీకు ఇబ్బంది కలక్కుండా చూస్తానని వారు కార్మికులకు హామీ ఇచ్చారు రెండు రోజుల నిరసన దీక్షకు సంఘీభావంగా సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మండల అధ్యక్షులు నెర్సుల వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ కామల్ల సువార్త బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు గుండమల్ల ఉపేందర్ మాట్లాడుతూ కార్మికుల పోరాటానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఉద్రేకపూరితమైన ఉపన్యాసమిచ్చి కార్మికులకు ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి షేక్ బషీర్ జిల్లా ఉప్పలయ్య షేక్ పాషా సంగయ్య రాజేష్ ఎల్లయ్య గురవయ్య గోపి నారాయణ రాని భాగ్యలక్ష్మి కొమ్ము రవి సురేష్ నేలమరి ముత్తయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు
Telangana
*పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి* పంచాయతీ కార్మికులు రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు మండల కేంద్రంలో భారీ ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించిన పంచాయతీ కార్మికులు సమస్యల పట్ల సానుకూలత స్పందించిన ఎంపీడీవో
Quick Summary:
సమస్యల పట్ల సానుకూలత స్పందించిన ఎంపీడీవో
