నేటి సాక్షి, పరిగి.
(గూడ సురేష్ మోత్కూర్ )
పరిగి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వార్డు కమిటీలు, బూత్ కమిటీలు మరియు పట్టణ కమిటీ నిర్మాణంపై విస్తృతంగా చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు.బుధవారం పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధార సింగ్ సూచనలతో, పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి. రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయడం, వార్డు కమిటీలు, బూత్ కమిటీల ఏర్పాటు, అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు.ప్రతి వార్డులో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు, ప్రతి బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ పార్థసారథి పంతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత వెంకటేష్, సీనియర్ నాయకులు కృష్ణ, పాలది శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, వైస్ చైర్మన్ కమల్, జిల్లా కార్యదర్శులు అక్బర్, రహీమ్ పటేల్, కౌన్సిలర్లు చంద్రయ్య,అయ్యుబ్,అఖిల శ్రీనివాస్, ఏజాజ్, గానమోని శ్రీనివాస్,యూసుఫ్, కుడుముల యాదయ్య, ఫిరంగి వెంకటరామిరెడ్డి, రవికాంత్ రెడ్డి, టౌర్యా నాయక్, బాలు, అఖిల్, మాణిక్యం, గౌతమ్, ఖలీల్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రజిత రెడ్డి, కావలి లక్ష్మి, శశికళ, సరిత,తదితరులు పాల్గొన్నారు.అలాగే మహిళా కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, BLAలు, వార్డు స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు పరిగి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Telangana
*పరిగి పట్టణ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో -పరిగి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశం.*
Quick Summary:
పరిగి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ