నేటి సాక్షి ,కోదాడ నియోజకవర్గం
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచారు.
అనంతగిరి మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కొండపల్లి దేవా తండ్రి కొండపల్లి నాగయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న మల్లయ్య యాదవ్ వారి స్వగ్రామానికి వెళ్లి నాగయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి జరిగిన నష్టం తీరనిదని, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా మోతే మండలం విభాలాపురం గ్రామ మాజీ సర్పంచ్ ఏపూరి సందీప్ ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై గాయపడిన విషయం తెలుసుకున్న మల్లయ్య యాదవ్ ఆయనను పరామర్శించారు. సందీప్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, చికిత్స వివరాలను ఆరా తీశారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.
ప్రజా జీవితంలో పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే తన బాధ్యత అని మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. రెండు కుటుంబాలను పరామర్శించిన ఆయన తీరుపై స్థానికులు, నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
Telangana
ఒకరికి నివాళి.. మరొకరికి పరామర్శ.. విషాదంలోనూ, ఆపదలోనూ కుటుంబాలకు అండగా నిలిచిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..
Quick Summary:
దృక్పథాన్ని చాటుకుంటున్నారు కోదాడ
