నేటి సాక్షి ఆగస్టు పాములపాడు (ఆగస్టు-19):-
రైతులు వేసుకునే విధంగా ఆరుతడి పంటలకు కేసీ కెనాల్ కు నీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.వెంకటేశ్వరరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ రైతులు జూన్ లో కురిసిన తొలకరి వర్షాలకు పంటలు వేసుకున్నారని అయితే జూన్, జూలై నెలలో వర్షాలు సరిగా పడక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో అరకొర పంటలు చేతికి వచ్చినప్పటికీ కనీస మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా పంటలు వేసి రైతులు వర్షాలు లేకపోవడంతో వాటిని దున్నివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీ.కెనాల్ నీరు రావడం వల్ల రైతులు ఆరుతడి పంటలకు వేసుకునే విధంగా నీరు ఇవ్వాలన్నారు. కెసికి నీరు త్రాగునీటి కోసం వదిలారని అధికారులు చెబుతున్నారని, మరి రైతుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు ప్రజా ప్రతినిధులు ప్రతిరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని రైతుల గురించి మాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల గురించి పదేపదే గొప్పలు చెబుతున్నారు. తప్ప వారిని పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కేసి కెనాల్ కింద ఉన్న పొలాలకు ఆరుతడి పంటలకు మీరు ఇచ్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా అధికారులతో మాట్లాడి నీరు తూములకు వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్.బాలయ్య, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Andhra
*ఆరు తడి పంటలకు కేసీ.కెనాల్ కు నీరు ఇవ్వాలి:-సిపిఎం, ఏపీ రైతు సంఘం నాయకులు*
Quick Summary:
రైతులు వేసుకునే విధంగా ఆరుతడి