*నేటిసాక్షి* ఆగస్టు 19(రుద్రరాజు).
దివ్యాంగుల సంక్షేమానికి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల అశోక్ మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో వీరబోయిన గణితకు మోటరైజ్డ్ ట్రై సైకిల్ అందజేశారు. దీంతో గణిత ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఇబ్బంది పడుతున్న నాకు ప్రయాణ సౌకర్యం దీని ద్వారా సుఖవంతమవుతుందని పట్టలేని సంతోషంతో గణిత ఆనందాన్ని వెలబుచ్చింది
దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి స్వయం ఆధారంగా జీవించే అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పుల అశోక్, ఎస్సై కూచిపూడి జగదీష్, మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, బుద్ధ వంశీ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోరపాక నాగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, తవడబోయిన కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీరబోయిన దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*దివ్యాంగుల సంక్షేమానికి ఇందిరమ్మ ప్రభుత్వం భరోసా*
Quick Summary:
నిలుస్తోందని తిరుమలాయపాలెం మండల