Telangana
*విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం* * బీఆర్ఎస్ విద్యార్థి నేత దేవి వంశీ కృష్ణ
Quick Summary:
బీఆర్ఎస్ విద్యార్థి నేత దేవి వంశీ కృష్ణ
*నేటి సాక్షి, ధర్మారం:* ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని బీఆర్‌ఎస్ విద్యార్థి నేత దేవి వంశీ కృష్ణ ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు చేపట్టిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తుంటే, ప్రభుత్వం వారిని అణచివేసేందుకు శక్తిని ప్రయోగించడం దురదృష్టకరమని వాపోయారు. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు వంశీ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛను హక్కుగా కల్పించిందని, ఆ హక్కులకు విఘాతం కల్పించేలా విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆందోళనకారులపై అణచివేత ధోరణిని వీడి, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.