నేటిసాక్షి, మిర్యాలగూడ: మండల పరిధిలోని చింతపల్లి గ్రామంతో పాటు మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న సర్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం ప్రత్యక్షంగా సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రతి బూత్‌లో నమోదవుతున్న దరఖాస్తులు, ఓటరు వివరాల సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన, ప్రజలకు అందుతున్న సేవలపై ఎమ్మెల్యే సమగ్రంగా ఆరా తీశారు. కార్యక్రమం పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం బూత్ లెవల్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా బూత్ లెవల్ ఏజెంట్లు కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు, బీఎల్ఓ లు, బీఎల్ఏ లు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, బీఎల్ఓ లు, బీఎల్ఏ లు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
"సర్' కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి -ఎమ్మెల్యే బిఎల్ఆర్
Quick Summary:
మండల పరిధిలోని చింతపల్లి
