నేటి సాక్షి గజ్వేల్: రాష్ట్రంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అగ్రవర్ణాలే అధికారాన్ని అనుభవిస్తున్నారని, ఆ ఆధిపత్య రాజకీయాలకు ఇక చరమగీతం పాడి బీసీలు రాజ్యాధికారం సాధించే దిశగా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తుప్పతి బిక్షపతి పిలుపునిచ్చారు. బీసీల జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యం దక్కే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
గజ్వేల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించిన బీసీ మహాసభ విజయవంతం కావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిందన్నారు. ఆ సభకు వివిధ జిల్లాల నుంచి భారీగా బీసీలు తరలిరావడం వారి రాజకీయ చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారని, అధికారంలో మాత్రం తగిన ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపించారు. ఇకపై ఆ పరిస్థితిని మార్చి బీసీలు రాజకీయ నిర్ణయాధికారులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
పార్టీలో సభ్యత్వం పొందే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కులాలకు అతీతంగా సామాజిక న్యాయాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అండగా నిలిచి బీసీ రాజ్యాధికార సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్, తో పాటు మండల, యువజన, రైతు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Telangana
**అగ్రవర్ణాల పాలనకు చరమగీతం పాడాల్సిందే..! బీసీలే రాజ్యాధికారం సాధించాలి: తుప్పతి బిక్షపతి భువనగిరి సభతో బీసీ రాజకీయ చైతన్యానికి శ్రీకారం.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు**
Quick Summary:
బీసీలే రాజ్యాధికారం సాధించాలి