నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, నిర్మానుష్య ప్రాంతాలు, రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినాయి. ఈ తనిఖీలలో వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ , ఐదుగురు సబ్-ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) సభ్యులు పాల్గొని పాపులన్ డివైస్ సహాయంతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా బస్ స్టాండ్ సమీపంలో సుమారు 15 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అలాగే వాహనాలకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలను చూపించలేకపోయిన ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, మాదకద్రవ్యాల రవాణా వినియోగాన్ని నియంత్రించడం, దొంగతనాలు, ఇతర నేరాలను నివారించడం, ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా చర్యలు చేపట్టడం జరిగింది అని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపినారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు వికారాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని తెలిపినారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని డీఎస్పీ అంజయ్య తెలిపారు.
Telangana
వికారాబాద్ పట్టణంలో విస్తృత ప్రత్యేక తనిఖీలు – గంజాయి స్వాధీనం, వాహనాల స్వాధీనం – ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం. వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు, వికారాబాద్ డీఎస్పీ పర్యవేక్షణలో
Quick Summary:
వికారాబాద్ డీఎస్పీ పర్యవేక్షణలో


