నేటి సాక్షిశంకర్‌పల్లి ప్రతినిధి:( సుధాకర్ గౌడ్)
శంకర్‌పల్లి–మర్పల్లి రహదారి అభివృద్ధి అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ద్వారా స్పందించారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేకూర్త గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, శంకర్‌పల్లి–మర్పల్లి రహదారి అభివృద్ధి పనుల కోసం రూ.43 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ రహదారి అభివృద్ధిని ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అదే అంశంపై విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ శ్వేత పాండురంగారెడ్డి, కాశెట్టి చంద్రమోహన్, ప్రశాంత్ రెడ్డి శ్రీకాంత్ ముదిరాజ్ సీనియర్ నాయకులు ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Telangana
శంకర్‌పల్లి–మర్పల్లి రహదారికి ₹43 కోట్ల మంజూరు: కాంగ్రెస్
Quick Summary:
శంకర్‌పల్లి–మర్పల్లి రహదారి అభివృద్ధి అంశంపై