*నేటిసాక్షి,నల్లబెల్లి*
పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపం చెంది ఓ రైతు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని శనిగరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, అయోధ్యనగర్ గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అయోధ్య నగర్ గ్రామానికి చెందిన పుప్పాల దేవేందర్ (35) అనే రైతుకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది దీంతో పాటు ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఈ నేపథ్యంలో పంట సాగు కోసం చేసిన అప్పులు తీసుకొని పెట్టుబడిగా ఉపయోగించాడు. ఈ సంవత్సరం పంట సాగు కోసం వరి నారు ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఏడు వర్షాలు సరిగా కురువకపోవడంతో పెట్టిన పరిణామంతా ఎండిపోవడానికి గమనించిన బాధిత రైతు ఓపక్క వర్షాలు లేక పంటలు ఎలా పండుతాయి మరోపక్క పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఏ విధంగా తీర్చాలి అని మనస్థాపం చెంది నల్లబెల్లి మండలం శనిగరం శివారులోని జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్టుకు గురువారం ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనను గమనించిన బాటసారిలు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై సాయి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.
మృతుడికి భార్య ఒక కుమారుడు ఉన్నారు.
*ఆత్మహత్య చేసుకునే ముందు సర్పంచ్ కు ఫోన్ కాల్*
అప్పుల బాధ భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మృతుడు దేవేందర్ తన మిత్రులకు ఫోన్ ద్వారా తెలియజేయడంతో ఆ మిత్రులు అయోధ్య నగర్ సర్పంచ్ లింగమూర్తికి సమాచారం అందించారు. సర్పంచ్ లింగమూర్తి మృతుడికి ఫోన్ ద్వారా చనిపోయే ముందు మాట్లాడి ధైర్యం చెప్పాడు నీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది అధైర్య పడకు అండగా ఉంటామని పేర్కొన్నప్పటికీ నీవు ఎక్కడ ఉన్నావు అక్కడికి నేను వస్తానని సర్పంచ్ బయలుదేరడంతో మార్గమధ్యలోనే దేవేందర్ ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిసిందని అయోధ్య నగర్ సర్పంచ్ లింగమూర్తి పేర్కొన్నారు. ఈ సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
అప్పుల బాధతో మరణించిన యువ రైతు దేవేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడం తోపాటు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని గ్రామస్తుల తో పాటు పలువురు కోరారు.
Telangana
*అప్పుల బాధతో రైతు ఆత్మహత్య*
Quick Summary:
పంట పెట్టుబడి కోసం తెచ్చిన