నేటి సాక్షి జూలై 16
పెద్దకడుబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న 600 మీటర్ల సీసీ రోడ్డు, 1,200 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాణ్యమైన రహదారులు ఎంతో అవసరమన్నారు. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామానికి మెరుగైన రహదారులు, తాగునీరు, విద్యుత్, ఇతర ప్రాథమిక సదుపాయాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
చిన్నతుంబలం గ్రామంలో చేపట్టనున్న ఈ రోడ్డు పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, మంత్రాలయం మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షుడు మల్లికార్జున, చావిడి వెంకటేష్, సొసైటీ చైర్మన్ నర్సప్ప, మండల టీడీపీ కార్యదర్శి రామాంజులు, దశరథరాముడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Andhra
చిన్నతుంబలం గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు.. రూ.కోటి విలువైన రోడ్డు పనులకు భూమిపూజ
Quick Summary:
పెద్దకడుబూరు మండలం చిన్నతుంబలం
