నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం,రైతు సంఘం, అంబేద్కర్ సంఘంల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రజాధర్భ జిల్లా కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, అంబేద్కర్ సంఘం నాయకులు రాజు, రాములు మాట్లాడుతూ లు వికారాబాద్ మున్సిపల్ పట్టణంలోని అనంతగిరిపల్లి రామయ్య గూడా మేకల గండి జైదిపల్లి లో అక్రమ నిర్మాణాలు వెంటనే ఆపి సర్టిఫికెట్స్ ఇచ్చిన వారికి పొజిషన్స్ చూపించాలని నిజమైన పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెండింగ్ డబల్ బెడ్ రూమ్ లో పూర్తి చేసి వెంటనే పేదలకు పంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది.
అక్రమ నిర్మాణం లాభాలని అనేకసార్లు కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మార్వో మున్సిపల్ కమీషనర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు వర్తస్సు పలుకుతూ నిర్లక్ష్యం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఆయా ప్రాంతాలను సందర్శించి ఆయా కాలనీవాసులకు న్యాయం చేసి అక్రమ రకులపై చట్టపరమైన చర్య తీసుకుని సర్టిఫికెట్స్ ఉన్నవారికి నిజమైన పేదలను గుర్తించి ఇందిర ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ లో వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము.
లేనిచో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుదర్శన సతీష్, చంద్రయ్య గోపాల్ రెడ్డి చందయ్య , అనసూయ లాలయ్య శ్రీను నాయక్ సతీష్ సాయి కుమార్ రండ రమేష్ R.రాజు చంద్రయ్య కృష్ణ Rనరసింహులు R చంద్రయ్య చేరన్ బందయ్య వెంకటయ్య అనంతయ్య వందన పెంటయ్య సాయిలు కుమార్ బాలరాజు గోపాల్ చందు లక్ష్మీ అనసూయ ఎల్లమ్మ ఆయా కాలనీ వాసుల పాల్గొన్నారు.
Telangana
రామయ్య గూడా అనంతగిరిపల్లి లో అక్రమ నిర్మాణాలు ఆపాలి. ప్రభుత్వం ఇచ్చిన పట్టా సర్టిఫికెట్స్ కు పొజిషన్ చూపించాలి. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేసి, నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సిపిఎం నాయకులు డిమాండ్.
Quick Summary:
సిపిఎం నాయకులు డిమాండ్.