నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఆగస్టు 12
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో చౌడేపల్లి మండలం భక్తలాపురం రోడ్డులో ఒక వరిగడ్డి వాము అగ్నిప్రమాదమునకు గురైనదని 12-08-2026 వ తేదీన ఉదయం సుమారు 10:10 గంటలకు అగ్నిప్రమాద వార్త వచ్చిన వెంటనే ఇన్చార్జి కేంద్రాధికారి గారి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సంఘటన స్థలమునకు చేరుకొని యజమాని S. సయ్యద్ బాషా, తండ్రి పేరు S. అసం షావలి కి సంబంధించిన వరిగడ్డి వామును సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో పూర్తిగా ఆర్పి వేయడం జరిగినది. ఈ ప్రమాదంలో నష్టం సుమారు 50,000 రూపాయలు ఉండవచ్చునని యజమాని తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదమునకు గల కారణం గుర్తు తెలియని వ్యక్తులు బీడీ లేదా సిగరెట్ తాగి మొక్క ఆర్పకుండా పడేయడం వలన ప్రమాదం జరిగినట్టు ఊహించడమైనది. ఈ ప్రమాదం నందు అగ్నిమాపక సిబ్బంది ఇ.సుబ్రమణ్యం, ఎం. లోకేష్ రెడ్డి, వి. కేశవ, కె. మోహన్ బాబు లు పాల్గొనడం జరిగినది.
Andhra
చౌడేపల్లిలో వరిగడ్డి వాము దగ్ధం: ₹50 వేల నష్టం
Quick Summary:
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో చౌడేపల్లి