నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ఇంటికి సంబంధించి యజమానుల పేరు మార్పులు, ఇతర విషయాలలో స్థానిక అధికారి ఒకరు నేరుగా చేతులు చాపి పనులను చక్కబెడుతున్నాడు. ఈ విషయంలో అతనికి పైసలు ఇచ్చేవారు ప్రజాప్రతినిధులైన కావచ్చు, పెద్దరికంగా ఉన్న వారైనా కావచ్చు సంబంధం లేదు. పని విషయంలో తేడారాదు పని పూర్తి చేస్తాడు, కానీ చేయి తడవలేదో అంతే ఆ పనిని ఏదో ఒక సాకుతో కాలయాపన చేసి వారికీ వారే అమౌంట్ ఇచ్చేలా చేసుకుంటాడు.ఇలా ప్రస్తుతం ఎన్నికైన ప్రజా ప్రతినిదే స్వయంగా డబ్బులు ఇప్పించి మరి పనులను చేయించుకున్నట్లు సమాచారం.ఇంత జరుగుతున్నా మండల స్థాయి అధికారులు సైతం మిన్నకుండటం పలు అనుమానాలకు దారితిస్తున్నాదని కొంతమంది నాయకులు బహిరంగంగా అంటున్నారు. ఈ విషయం పై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేసి బాధ్యుల పై తగిన చర్యలు తీసుకువాలని పలువురు కోరుతున్నారు.
Telangana
*లంచం ఇచ్చుకో.. పేరు మార్చుకో*.. 👉ఇంటి యజమానుల పేరు మార్పులు తదితర విషయాలలో గోల్ మాల్...
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో