నేటి సాక్షి జూలై 27 పాములపాడు:-
నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా
పాములపాడు మండలంభానుముక్కల గ్రామంలో వివాదాస్పదమైన శ్మశాన వాటిక దారి పై మాకు న్యాయం చేయండి అని భానుముక్కల గ్రామస్తులు సుమారుగా 150 మంది గ్రామ సమస్యపై వినతి పత్రం ఇచ్చుటకు మండల తహసీల్దారు కార్యాలయానికి వచ్చి ఉన్నారు.
ఈ విషయంపై గ్రామస్తులు పూర్వం నుండి గ్రామ స్మశాన వాటిక నుండి క్రతువు నిర్వహించుట కొరకు కప్పల బావి దగ్గరకు వెళ్ళుటకు సర్వే నంబర్ 203 ,211 సర్వే నంబర్ గల భూమిలో రాస్తా ఉన్నది. ఈ రాస్తా విషయమై పై భూమి గల రైతు అభ్యంతరం తెలుపుతున్నాడు. ఈ రైతు కొనుగోలు చేసిన డాక్యుమెంట్ లో స్పష్టంగా రాస్తా కనపరిచారు. అయినను అభ్యంతరం తెలుపుతున్నాడు. ఈ విషయమై తాసిల్దార్ సుభద్రమ్మ వారికి గ్రామ ప్రజలందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం లో భానుముక్కల గ్రామ మాజీ ఎంపీపీ భర్త బండ్లమూరి వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్. జె. బాలు నాయక్ మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Andhra
స్మశాన వాటిక దారి పై మాకు న్యాయం చేయండి.భానుముక్కల గ్రామస్తులు అందరూ కలిసి తహసీల్దార్ జి . సుభద్రమ్మ కు వినతి పత్రం అందజేసిన గ్రామ ప్రజలు....
Quick Summary:
నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా
