నేటి సాక్షి,మునగాల
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు వరి సాగుపై ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని జిల్లా ప్రజా పరిషత్ సూర్యాపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. మహాలక్ష్మి సూచించారు. మాధవరం గ్రామపంచాయతీ పరిధిలో రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సాగునీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా మినుములు, కందులు, బొబ్బెర్లు, పెసర్లు, ఆముదాలు తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం ద్వారా నీటి కొరతను అధిగమించడంతో పాటు రైతులు పంట నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని ఆమె కోరారు.
కార్యక్రమంలో మాధవరం గ్రామపంచాయతీ సర్పంచ్, మునగాల ఎంపీడీఓ రమేష్ దిన్ దయాల్, మాధవరం ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Telangana
వరి సాగుకు బ్రేక్.. ఆరుతడి పంటలే బెటర్! వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి.. మినుములు, కందులు, బొబ్బెర్లు, పెసర్లు, ఆముదాలు సాగు చేయండి.. రైతులకు సూచించిన జెడ్పీ డిప్యూటీ ఈఓ కె. మహాలక్ష్మి..
Quick Summary:
వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి..