నేటి సాక్షి, మునగాల
విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామంలోని మోడల్ స్కూల్‌ను ఆయన సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆహార నాణ్యత, హాస్టల్ వసతి, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, హాస్టళ్లలో పరిశుభ్రత, భద్రత, తాగునీరు, వసతి, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యం చేయడం తగదని, నాసిరకం ఆహారం అందిస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్‌లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు తగిన నిధులు విడుదల చేయాలని, కోదాడ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలకు పూర్తి భరోసా కల్పించాలని అన్నారు.
ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సురక్షిత వాతావరణం కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
Telangana
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి... విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించి విద్యా ప్రమాణాలు పెంచాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..
Quick Summary:
విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించి

