నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఎం. భీమార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో కామర్స్ సబ్జక్ట్ లో (బి.ఎఫ్.ఎస్.ఐ.) 01, తెలుగు సబ్జక్ట్ లో 01 ఖాళీలు ఉన్నాయని, సంబంధిత సబ్జక్ట్ పి. జి. లో 55% తో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పి.హెచ్ డి, నెట్, సెట్, బోధనానుభవం కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు ఈ నెల 24 వ తేదీ లోపు దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో నేరుగా సమర్పించాలని తెలిపారు. ఈ నియామకాలు కమీషనర్, కళాశాల విద్య వారు జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి ఉంటాయని ప్రధానాచార్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana
తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
Quick Summary:
అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి