నేటిసాక్షి, మిర్యాలగూడ : గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
గిరిజన విద్యార్థుల విద్యా సమస్యలను పరిష్కరించడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. అనంతరం గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి దిరావత్ కోటియా నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని అన్నారు. విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్‌లో ఉండటంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు ఇందల్ రాథోడ్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట్ బంజారా, జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లావూరి రవీందర్ నాయక్,సైదా నాయక్, తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గిరిజన విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
Telangana
గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష -ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
Quick Summary:
పరిష్కారం కోసం ప్రభుత్వం