నేటిసాక్షి, మిర్యాలగూడ ఆగస్టు :
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్ కుమార్
అన్నారు. పట్టణంలోని రైతు వేదికలో శనివారం వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ, రైతులు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులపై ఆధారపడకుండా, ప్రకృతి సంబంధమైన ఎరువులను ఉపయోగించి, భూసారాన్ని పెంచాలని, తద్వారా సాగు ఖర్చులు కూడా తగ్గి, రైతుకు మేలు జరుగుతుందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల దృశ్య రైతులు సజ్జలు, జొన్నలు, మినుములు, కందులు, పెసలు పండించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కె. జగదీశ్వర్‌రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాములమ్మ, మండల వ్యవసాయ అధికారి ఎం. రుషేంద్రమణి, వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, సాంకేతిక నిర్వాహకులు గిరి, వ్యవసాయ విస్తరణ అధికారులు అఫ్రీన్, నాగయ్య, అలగడప సర్పంచ్ ఇంద్రపల్లి కుమారి, ఇంద్రపల్లి శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, సైదులు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన
Quick Summary:
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా