నేటిసాక్షి, మిర్యాలగూడ : మండల పరిధిలోని యాదగిరిపల్లి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన త్రాగునీటి ప్లాంట్‌ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ముందుకు వచ్చినటువంటి దాతలు అభినందనీయమని వారిని ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛమైన నీరు తాగడం ద్వారా అనేక వ్యాధుల నుండి రక్షించుకోవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులకు త్రాగునీటి సీసాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
ప్రభుత్వ పాఠశాలలో... దాతల సాయంతో త్రాగునీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు -ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
Quick Summary:
ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

