నేటి సాక్షి, కులకు చర్ల
(గూడ సురేష్ మోత్కూర్ )
కుల్కచర్ల మండల కేంద్రంలో 25 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులకు మండల కేంద్రము లో పోతుల గుట్ట పైన శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ప్రముఖ దాత సుంకిరెడ్డి ప్రకాష్ రెడ్డి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ భారీ విగ్రహ నిర్మాణ బాధ్యతను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, PACS చైర్మన్ బోల్సని భీమ్ రెడ్డి గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య బ్లాక్ 2 అధ్యక్షులు కర్రే భరత్ కుమార్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ ఇంద్రమ్మ కమిటీ కన్వీనర్ సుంకిరెడ్డి కృష్ణ రెడ్డి అడ్వకేట్ బాల ముకుందం గారు డైరెక్టర్ తమ్మల రామచంద్రయ్య చెలిమిళ్ల ఆనందం మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్ వార్డ్ మెంబెర్ రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ వినోద్ కుమార్ మలే కృష్ణయ్య గౌడ్ కంగారి ఆంజనేయులు చందు కృష్ణయ్య కొమ్ము శ్రీను జై వెంకటయ్య సంగప్ప వీరేశం అశోక్ గ్రామ పెద్దలు,భక్తులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ విగ్రహ నిర్మాణానికి సహకారం అందిస్తున్న దాత ప్రకాష్ రెడ్డిని గ్రామస్తులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Telangana
*కులకచర్ల మండల కేంద్రంలో 25 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా రోడ్డు వేసేందుకు భూమి పూజ.*
Quick Summary:
కుల్కచర్ల మండల కేంద్రంలో